రాఫెల్ యుద్ధ విమానాన్ని అధిరోహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్‌లో అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధిరోహించారు. ఈ ఉదయం దేశ రాజధానిలోని తన అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం రాఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమె వెంట ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము రాఫేల్ యుద్ధ విమానంలోకి ఎక్కుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.