బీట్‌రూట్‌ను శీతాకాలపు సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిలోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి రక్తపోటును తగ్గించడంలో, వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్‌గా వాటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. జీర్ణ సమస్యలు లేదా మలబద్ధకంతో బాధపడేవారికి బీట్‌రూట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో దీన్ని తినడం వల్ల కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. హెల్త్‌లైన్ ప్రకారం, ఈ పండు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో దాదాపు 3.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.. ఇది ఫైబర్ కు మంచి మూలంగా మారుతుంది. ఫైబర్ మన శరీరంలో పూర్తిగా జీర్ణం కాదు. ఇది పెద్దప్రేగుకు చేరుకుంటుంది.. మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది.. మలాన్ని స్థూలంగా, మృదువుగా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.. అలాగే ప్రేగును శుభ్రంగా ఉంచుతుంది. బీట్‌రూట్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.. మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను నివారిస్తుంది. దుంపలలో లభించే ఫైబర్ తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దుంపలలో ఉండే ఇనుము అలసటను తగ్గిస్తుంది.. ఇంకా శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడం ద్వారా మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీనిలోని ఫైబర్ అజీర్ణం, నెమ్మదిగా జీర్ణక్రియకు సంబంధించిన సాధారణ శీతాకాల సమస్యలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. బీట్‌రూట్ సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తుంది.. కాలేయాన్ని శుభ్రపరచడంలో, శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
0 Comments