షేర్ మార్కెట్ లో నష్టాలు : కొడుకుని చంపి, భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి


చెన్నై తేనాంపేటలోని కేంద్ర భద్రతా విభాగ కార్యాలయంలో సీనియర్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న నవీన్ కణ్ణన్ అన్నానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం వుంటున్నారు. ఆయనకు భార్య నివేదిత (35), కుమారుడు లవిన్ (7) ఉన్నారు. నివేదిత దక్షిణ రైల్వే ఉద్యోగిని. వారితో పాటు నవీన్ తల్లిదండ్రులు ఉంటున్నారు. గదిలోంచి నివేదిత కేకలు వేయడంతో అత్తమామలు పరుగున వెళ్లి చూశారు. కోడలు, మనవడు గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నారు. ప్రాణాలతో ఉన్న నివేదితను ఆసుపత్రికి తరలించారు. నవీన్ కణ్ణన్ కు గత కొద్ది కాలంగా షేర్ మార్కెట్ లో నష్టాలు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు జరిగేవి. నిన్న ఇదే విషయంలో ఇరువురు మధ్య గోడవ జరగడంతో నవీన్ గదిలో నిద్ర పోతున్న కుమారుడిని చంపేశాడు. తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్న క్రమంలో భార్య అడ్డుపడింది. దీంతో భార్యను సైతం గొంతు కోసి చంపాలని చూశాడు. తీవ్ర గాయాలతో బెడ్ రూంలో పడి ఉన్న నివేదితను కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org