యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ల డాలర్లు దాటింది. ఐఫోన్ 17మోడల్స్ అమ్మకాల జోరు పెరగడంతో యాపిల్ కంపెనీ షేర్లు కూడా దూసుకెళ్తున్నాయి. యాపిల్ కంపెనీ చరిత్రలో 4 ట్రిలియన్ మార్కెట్ వాల్యూను చేరుకోవడం ఇదే తొలిసారి. ఆ మైలురాయి అందుకున్న మూడవ టెకీ కంపెనీగా యాపిల్ సంస్థ నిలిచింది. గతంలో ఈ రికార్డు అందుకున్న కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, nvidia ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తేదీన కొత్తగా రిలీజైన ఐఫోన్ల అమ్మకాల వేగం పెరగడంతో యాపిల్ కంపెనీ షేర్లు అప్పటి నుంచి 13 శాతం వృద్ధి సాధించాయి. దీంతో స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ముందుకెళ్తున్నది. బుధవారం ఉదయం యాపిల్ కంపెనీ షేర్లు 0.4 శాతం పెరిగాయి. గడిచిన జూలైలో మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ అందుకున్నది.
4 ట్రిలియన్ డాలర్లు మార్కెట్ వాల్యూను చేరుకున్న యాపిల్ కంపెనీ
by Telugu Lo Computer at October 29, 2025
Labels:
Apple Company Reaches $4 Trillion Market Value
,
Microsoft and nvidia were among the companies that achieved this record.
,
Previously
,
science
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment