కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు !


ర్ణాటకలోని ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది. తాజా హైకోర్టు నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేసిందని హైకోర్టు అభివర్ణించింది. ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ చర్య ప్రైవేట్ సంస్థల చట్టబద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషన్ తరుఫు న్యాయవాదులు వాదించారు. జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ ఆదేశంపై మధ్యంతర స్టే విధించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. మంత్రి హెచ్.కె. పాటిల్ ప్రభుత్వం ఏ ప్రత్యేక సంస్థకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ నిర్ణయాన్ని ఏ సంస్థకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా తీసుకురాలేదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించడనికి తీసుకొచ్చాం. ఏదైనా ఉల్లంఘనపై ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org