టీసీఎస్, కాగ్నిజెంట్ హెచ్ 1బీ వీసాస్పాన్సర్‌షిప్ ను నిలిపివేశాయి. మరో రెండు అమెరికన్ కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. ఇంట్యూటివ్ సర్జికల్, వాల్‌మార్ట్ దీనికి పుల్ స్టాప్ పెట్టాయి. మరికొన్ని ఐటీ కంపెనీలు విదేశీ ఉద్యోగుల వీసా స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేశాయి. ఈ నిర్ణయం- భారత్ సహా వివిధ దేశాలపై పడుతోంది. అమెరికన్ జాబ్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రత్యేకించి భారత్ వంటి విదేశీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పై ఆధారపడిన కంపెనీలకు ఇది పెను భారంగా మారింది. భారత్ కు చెందిన టెక్కీలపై ఎక్కవగా ఆధారపడ్డ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ తన జాబ్ నోటిఫికేషన్ లో మార్పులు సైతం చేసింది. తమ సంస్థలో చేరదలిచిన ఐటీ నిపుణులకు మేనేజ్ మెంట్ విసా స్పాన్సర్‌షిప్ లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా పని చేయడానికి అవసరమైన అర్హతలను కలిగి ఉండాలని పేర్కొంటోంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రతినిధి నిర్ధారించారు కూడా. న్యూస్‌వీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లక్ష డాలర్ల విసా ఫీజు నిబంధన వల్ల తమ కార్యకలాపాలు ప్రభావితమౌతోన్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెచ్ 1బీ స్పాన్సర్లలో ఒకటైన భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం దీనికి బ్రేకులు వేసింది. హెచ్ 1బీ స్పాన్సర్ కింద చేపట్టాల్సిన నియామకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృతివాసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువ మంది అమెరికన్ టెక్కీలనే నియమించుకుంటోన్నట్లు చెప్పారు. కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడంలో లోకల్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన మెడ్-టెక్ సంస్థ ఇంట్యూటివ్ సర్జికల్ కూడా కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. హెచ్ 1బీ వీసా స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసింది. 2,400 మందికి పైగా హెచ్ 1బీ వీసాదారులను కలిగి ఉన్న రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కూడా ఈ స్పాన్సర్‌షిప్‌లను రద్దు చేసినట్లు తెలిపింది.
0 Comments