తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+5 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇందులో వెయ్యి పడకలు, 30 విభాగాల్లో కార్పొరేట్ తరహా వైద్యసేవలు రోగులకు అందనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రిటికల్ కేసులకు రిఫరల్ ఆసుపత్రులుగా ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోపర్, ఫీవర్, ప్రసూతి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం భావించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి అత్యవసర పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రులకు వెళ్లాలంటే ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా పెద్ద ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్‌లో సుమారు రూ.2,500 కోట్లతో మూడు ఆసుపత్రులను ప్రతిపాదించింది. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో టిమ్స్ నిర్మాణానికి 22.6 ఎకరాలు కేటాయించింది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. ఎల్‌బీ నగర్, అల్వాల్‌లో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా వివిధ కారణాలతో పనులు పూర్తికాలేద సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రధానంగా గుండె జబ్బులకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించనున్నారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆధునాతన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. అవయవ మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషన్ థియేటర్లు, నిపుణులైన వైద్యులను కేటాయించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఫర్ కార్డియాక్ డిసీజెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం అందుబాటులోకి రానుంది. సుమారు 500 పడకలను గుండె వ్యాధుల రోగులకు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని హృద్రోగ నిపుణులతో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ఇతర విభాగాలైన ప్రసూతి, పీడియాట్రిక్, న్యూరాలజీ, ఈఎన్‌టీ, పల్మనరీ, ఇతర విభాగాల్లోనూ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
by Telugu Lo Computer at October 30, 2025
Labels:
100 crore
,
constructed with an area of 11.68 lakh square feet at an estimated cost of Rs. 1
,
Corporate-style medical services
,
Telangana Institute of Medical Sciences to be available in December
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment