బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని, అది తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీకి ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో, థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది. ఇది క్రమంగా పశ్చిమం వైపు కదులుతుంది. అది దిశమార్చుకోకుండా అలానే ముందుకు వస్తే ఏపీలోని గుంటూరును చేరగలదని తెలుస్తోంది. అయితే, దాని దిశ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇది అల్పపీడనంగా ఉంటుందా వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని, ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
0 Comments