మాజీ మంత్రి హరీష్ రావుకు పితృ వియోగం
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి, వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు.