అధికారిక వాట్సాప్‌ ఛానెల్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్‌


దేశంలో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్ డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో కావాలంటూ అధికారిక  ఛానెల్‌ను బుధవారం ప్రారంభిస్తూ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ మోసాలు అధిక అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్‌ ఫేక్‌ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు 'సేఫ్‌ వర్డ్‌'తో రక్షణ పొందాలని హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు 'సేఫ్‌ వర్డ్‌' ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్‌ ఫేక్‌, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ'సురక్షిత పదం' (సేఫ్‌ వర్డ్‌)ను ఉపయోగించాలన్నారు. ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో 'సురక్షిత పదం' బలమైన రక్షణగా నిలుస్తుందని మంగళవారం తన 'ఎక్స్‌' ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్‌ పేర్కొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org