రూ.3 కోట్లు టోపీ పెట్టిన లేడీస్‌ టైలర్‌కు దేహశుద్ధి చేసిన మహిళలు

Telugu Lo Computer
0


ర్ణాటకలోని దొడ్డబళ్లాపుర జిల్లా హాసన్‌ పట్టణంలోని అరళేపేటెలో స్థానికంగా లేడీస్‌ టైలర్‌ షాప్‌ నిర్వహించే హేమావతి మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి రూ.3 కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన మహిళను నడిరోడ్డులో మహిళలు చితకబాదారు. ఆమె టైలర్‌గా అందరితో పరిచయాలు పెంచుకుంది. ఒకరికి తెలియకుండా మరొక మహిళకు మాయమాటలు చెప్పి రూ. లక్షలాదిగా అప్పులు తీసుకుంది. ఆ డబ్బుతో దండిగా బంగారు నగలు, కారు, స్థలాలు వంటివి కొనుక్కుంది. విలాస జీవనం చేస్తోంది. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో అడిగి అడిగి విసిగిపోయిన మహిళలు హేమావతిని రోడ్డు మీద జుట్టుపట్టుకుని కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. హాసన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default