Ad Code

₹4,194 కోట్లతో ఫస్ట్‌ క్రై ఐపీఓ !


న్‌లైన్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌  ఐపీఓ ద్వారా రూ.4,194 కోట్లు సమీకరించనుంది. ఆగస్టు 6 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.440-465గా నిర్ణయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఆగస్టు 5న సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఐపీఓలో భాగంగా 75 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం చొప్పున రిజర్వ్‌ చేశారు. ఇన్వెస్టర్లు ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 32 షేర్లను (లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ రూ.1666 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా జారీ చేస్తోంది. రూ.2,528 కోట్లకు సమానమైన 5.44 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు వదలుకోనున్నారు. సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన ఏవీఎఫ్‌ ఫ్రాగ్‌ 2.03 కోట్లు, ఆటో మొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా 28.06 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ప్రస్తుతం బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 25.55 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 10.98 శాతం వాటా ఉంది. సాఫ్ట్‌బ్యాంక్‌, మహీంద్రాతో పాటు పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌, టీపీజీ, న్యూక్వెస్ట్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్‌, యాప్రికాట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్క్రోడర్స్‌ క్యాపిటల్‌ సంస్థలు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా షేర్లను విక్రయించనున్నాయి. 2010లో ఫస్ట్‌ క్రై ప్రారంభమైంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఓ వయసు వచ్చే పిల్లలు, వారి తల్లులకు అవసరమైన అన్ని వస్తువులను ఒకచోట అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. భారత్‌ సహా యూఏఈ, కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియాకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను కంపెనీ 'బేబీ హగ్‌' పేరిట కొత్త స్టోర్లను నెలకొల్పేందుకు ఆ కంపెనీ వినియోగించనుంది. విదేశాలకు ఈ బ్రాండ్‌ను విస్తరించనుంది. సేల్స్‌, మార్కెటింగ్‌ కార్యకలాపాలు, కార్పొరేట్‌ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బోఫా సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్‌, అవెండస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu