5,000 గ్రహాల్లో ఏలియన్స్?


5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” ఇటీవల ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఇఎస్ఎస్) ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ టీఇఎస్ఎస్ శాటిలైట్ ను ప్రయోగించింది. ఆనాటి నుంచి 5,000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ  ఉపగ్రహం వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే 24 00 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ టీఇఎస్ఎస్ గుర్తించిందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు. టీఇఎస్ఎస్ గుర్తించిన 5,000 బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. టీఇఎస్ఎస్ ఉపగ్రహం ఖగోళ వస్తువును కనిపెట్టి దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండడంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యం అవుతుంది. టీఇఎస్ఎస్ కంటే ముందు బాహ్యగ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్లెర్ టెలిస్కోప్ 2000 ఖగోళ వస్తువులను కనుగొన్నా.. అవేవి.. గ్రహాలుగా నిర్ధారింపబడలేదు. టీఇఎస్ఎస్ కనిపెట్టిన ఒక గ్రహంపై ఏడాది కాలం భూమిపై 16 గంటలకే ముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు. దీంతో టీఇఎస్ఎస్ పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదిరింది. అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన టీఇఎస్ఎస్ శాటిలైట్ సేవలను మరో మూడేళ్ళ పాటు (2025 వరకు) వినియోయోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశాం ఉందని మాత్రమే అంచనా వేశామని.. కానీ నిర్ధారణ చేయలేదని మిచెల్ కునిమోటో తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం