టీటీడీకి రూ.9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు

Telugu Lo Computer
0


మంతెన రామలింగ రాజు టీటీడీకి రూ.9 కోట్లు విరాళంగా ఇచ్చారు. తన కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణకు మంతెన రామలింగరాజు ముందుకొచ్చారన్నారు. వారి కూతురు, అల్లుడి పేరిట విరాళాన్ని ఇచ్చారన్నారు. వారు ఇచ్చిన విరాళంతో భవనాలను ఆధునీకరిస్తామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని మంతెన రామలింగ రాజు చూపిన సేవాభావానికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా  2012లో కూడా రామలింగ రాజు రూ.16 కోట్లు విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default