Ad Code

ఏసీ బస్సులో 10 శాతం వరకు ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్ఆర్టీసీ


డిసెంబర్ 1నుంచి 20వ తేదీ వరకు ఇంద్ర, అమరావతి ఏసీ బస్సులో 10 శాతం వరకు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఆదివారం ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదు. గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో 10 శాతం వరకు తగ్గుతుంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో ఛార్జీ తగ్గుతుంది. గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 700 నుంచి 640 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి బీహెచ్ ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 770 నుంచి 710 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 960 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.

Post a Comment

0 Comments

Close Menu