మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్ జీని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే నవంబర్ 18న జరిగిన మావో కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. అదే సమయంలో దేవ్ జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీకేఎస్‌జెడ్‌సీ తెలిపింది. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బంద్‌కు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. కాగా నవంబర్ 18న హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత దేవ్ జీ ఆచూకీ లభించలేదు. దేవ్ జీ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఇటు పోలీసులు కానీ.. అటు మావోయిస్టులు కానీ నిర్ధారించలేదు. ఎట్టకేలకు దేవ్ జీకి సంబంధించి మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. పోలీసుల అదుపులో దేవ్ జీ ఉన్నారని.. అతడిని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ లేఖలో స్పష్టం చేసింది. నవంబర్ 18న ఏపీ పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారని.. కానీ పక్కా ప్రణాళికతోనే హిడ్మాను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని.. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని కమిటీ భావిస్తోంది. దేవ్ జీతో పాటు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ లేఖలో డిమాండ్ చేసింది. అయితే దేవ్ జీ తమ ఆధీనంలో లేరని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. అలాగే ఏపీ పోలీసులు కూడా దేవ్ జీ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. దేవ్ జీ ఆచూకీపై ఆయన బంధువులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా దేవ్ జీ తమ ఆధీనంలో లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.
దేవ్ జీని కోర్టులో హాజరుపర్చాలి : మావోయిస్టు దండకారణ్య కమిటీ డిమాండ్
by Telugu Lo Computer at November 28, 2025
Labels:
alleged that the encounter of key Hidma on was a hoax
,
Dev Ji should be produced in court
,
Maoist Dandakaranya Committee demands
,
national
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment