Ad Code

తొలి వన్డేలో సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యం నిర్ధేశించిన భారత్‌


రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్‌ నమోదు చేసింది. టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎనుచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా రోహిత్‌ శర్మ అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు. రోహిత్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి, ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన కోహ్లి నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా, రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), వాషింగ్టన్‌ సుందర్‌ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్‌ 349 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్‌ విధించింది.

Post a Comment

0 Comments

Close Menu