డిసెంబర్ 4-5 తేదీలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటనను విడుదల చేశాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆయనకు ఇది మొదటి పర్యటన కావడంతో ఈ భేటీ ఇండియాకు రక్షణ, ఇంధనం, దౌత్య రంగాలలో అనేక పెద్ద ప్రయోజనాలను అందించనుంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా భారత్‌పై అదనపు టారిఫ్‌లు అమలు చేస్తోన్న వేళ పుతిన్ రాక ఉత్కంఠను సృష్టిస్తోంది. ప్రధాని మోడీ ఆహ్వానం వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ - పుతిన్ భేటీ కానున్నారు. పుతిన్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈక్రమంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్ లో పర్యటించనున్న వ్లాదిమిర్ పుతిన్
November 28, 2025
0
Tags