అక్టోబర్ నెలలో 34,900 యూనిట్లు అమ్మిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తన పట్టును రోజురోజుకు పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరిగి మొత్తం 34,900 యూనిట్లు కొనుగోలుదారులకు చేరాయి. ఇది గత సంవత్సరం ఇదే నెల (అక్టోబర్)లో నమోదైన 30,644 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 13.89% వృద్ధిని సూచిస్తుంది. చేతక్ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది ఇది ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్‌లతో పోలిస్తే సరసమైన ధరలో లభిస్తోంది. రెండవది దీని బాడీని పూర్తిగా స్టీల్‌తో తయారు చేయడం వల్ల, క్వాలిటీ, మన్నిక విషయంలో వినియోగదారులకు మంచి నమ్మకాన్ని కలిగించడం జరిగింది. సాంప్రదాయ స్కూటర్ క్వాలిటీని కోరుకునే కస్టమర్లు దీని బిల్డ్ క్వాలిటీని ఇష్టపడుతున్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేతక్ 3001, చేతక్ 3501, చేతక్ 3502, చేతక్ 3503 వేరియంట్లలో లభిస్తోంది. ఈ వేరియంట్లు ధర, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్ల పరంగా విభిన్నంగా ఉన్నాయి.

బజాజ్ చేతక్ 3001బేసిక్ మోడల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.02 లక్షలుగా ఉంది. ఇందులో 3 కిలోవాట్-అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 127 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అత్యవసర ఛార్జింగ్‌కు అనుకూలంగా, బ్యాటరీ కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 0% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ వేరియంట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్రమ్ బ్రేక్‌లు వంటి బేసిక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ బ్రూక్లిన్ బ్లాక్, ఆజూర్ బ్లూ, సైబర్ వైట్, లైమ్ యెల్లో, రేసింగ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

బజాజ్ చేతక్ 3501 మోడల్ ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఇందులో కొంచెం పెద్దదైన 3.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల, పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 153 కి.మీ వరకు మెరుగైన రేంజ్ అందిస్తుంది. ఫీచర్ల పరంగా ఇది TFT డిజిటల్ డిస్‌ప్లేతో పాటు, మెరుగైన భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

బజాజ్ చేతక్ 3502 ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే ఈ వేరియంట్‌లో కూడా 3.5 kWh బ్యాటరీ, 153 కి.మీ రేంజ్ లభిస్తుంది. 3501 వేరియంట్ కంటే ఇందులో అదనంగా కలర్ TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్,స్మార్ట్‌ఫోన్ అనుసంధానం కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయి. ఇది కూడా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

బజాజ్ చేతక్ 3503  వేరియంట్ ధర రూ.1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 3.5 kWh బ్యాటరీని కలిగి ఉండి, 150 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. 3501, 3502 మోడళ్లకు మధ్యస్థంగా, ఇందులో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కంట్రో, మ్యూజిక్ కంట్రోల్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ పరంగా, దీనికి ముందు భాగంలో డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default