ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కు సంబంధించిన ఒక కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి రూ.56.44 కోట్ల జరిమానా విధిస్తూ అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తమకు గురువారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా అందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 74 కింద ఈ పెనాల్టీని విధించారు. అయితే, జీఎస్టీ అధికారుల ఈ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పుబట్టింది. సేవల ప్రదాత (సర్వీస్ ప్రొవైడర్) అందించిన సేవల వర్గీకరణను అధికారులు సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండానే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్డ్ క్రెడిట్‌గా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అధికారుల ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జరిమానా విధింపు !
November 28, 2025
0
Tags