బ్లాక్ ఫ్రైడే - డిస్కౌంట్ ఆఫర్లు !

Telugu Lo Computer
0


బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం అమెరికాలోనే ప్రారంభమైంది. అక్కడ ఈ రోజును ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఓ రకంగా దీనిని థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే నవంబర్ 28వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచే క్రిస్మస్ షాపింగ్ మొదలవుతుందని వారు నమ్ముతారు. ఈ అవకాశాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. మొదట్లో బ్లాక్ ఫ్రైడేను అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలలో కూడా దీని క్రేజ్ పెరిగింది. ఇ-కామర్స్ వెబ్ సైట్లు ఈ క్రేజ్ ను  పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే దీనిని ఇతర దేశాలలో కూడా జరుపుకోవడం ప్రారంభించారు. బ్లాక్ ఫ్రైడే అనే పేరు వినగానే ఇది చెడు లేదా దురదృష్టకరమైన రోజుగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను చూస్తే అలా అనిపించదు. కానీ ఈ పేరు పెట్టినప్పుడు నిజంగానే దీనిని బ్లాక్ డేగా భావించి పెట్టారట. వాస్తవానికి బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి గుర్తుగా చెప్తారు. దానికి సంబంధించిన షాపింగ్ చేస్తారు. పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నగర వ్యవస్థను అదుపులో ఉంచేందుకు పోలీసులను బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని అరవైల నుంచి డెబ్బైల మధ్య ఫిలడెల్ఫియా పోలీసులు దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సమయంలో అందరూ తమ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. కానీ తమ కుటుంబాలను విడిచిపెట్టి డ్యూటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. అందుకే దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అయింది. దీనిని ప్రతికూలంగా భావించి బ్లాక్ ఫ్రైడేను బిగ్ ఫ్రైడేగా మార్చడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ బ్లాక్ ఫ్రైడే అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని బ్లాక్ ఫ్రైడే గానే  పిలుస్తున్నారు. దీనిని కొనసాగించడానికి అమెరికా మార్కెట్లలో చాలా ఆఫర్లు, డిస్కౌంట్లు పెడతారు. దీనిని అనుసరిస్తూ అనేక దేశాలలో ఆన్ లైన్  షాపింగ్ అందించే వెబ్ సైట్లు దీనిని బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ప్రచారం చేయడం ప్రారంభించాయి. భారీ డిస్కౌంట్లపై షాపింగ్ అందిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default