ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్ , శిల్ప భార్యాభర్తలు. వెంకటేష్ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మనుషులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి వెంకటేష్ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త వెంకటేష్ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ స్వర్ణతేజ తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు.
0 Comments