తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులో జరిగిన మాజీ మావోయిస్టు బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న హత్య కేసు పెద్ద సంచలనం సృష్టించింది. గతంలో నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, దశాబ్దాల తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో పాత ఘటన మళ్లీ వెలుగులోకి రావడంతో జరిగిన ఈ హత్య సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హత్య వెనుక కారణం ఇటీవల యూట్యూబ్‌లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అని పోలీసులు తేల్చారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధన్న తన మావోయిస్టు కాలంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను వెల్లడించారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తానే హత్య చేశానని చెప్పడం పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ వీడియోను చనిపోయిన వ్యక్తి కొడుకు సంతోష్ చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన తండ్రిని చంపిన వ్యక్తి ఇప్పుడు సామాన్య జీవితంలో గౌరవంగా తిరుగుతున్నాడన్న భావనతో ఆగ్రహం పెరిగి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సంతోష్ సిద్ధన్నను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే సిద్ధన్నను సంప్రదించి, అభిమానిని అంటూ నమ్మకం సంపాదించుకున్నాడు. తరచూ మాట్లాడడం, కలవడం, వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా సిద్ధన్నను పూర్తి స్థాయిలో నమ్మించాడు. తరువాత అనుకూలమైన సమయం చూసి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా దాడి చేసి రాళ్లతో కొట్టి అతన్ని హతమార్చాడు. హత్య చేసిన వెంటనే సంతోష్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన సమయంలోనే అసలు విషయం బయటపెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. సిద్ధన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీలో దశాబ్దం పాటు పనిచేసి, అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. కోవర్టు హత్యాకాండల్లోనూ, పలు ఎన్‌కౌంటర్ ఘటనల్లోనూ అతని పాత్ర ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. 2004లో ఆయన స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయి, ప్రభుత్వ పునరావాస పథకాలతో సాధారణ జీవితాన్ని ప్రారంభించారు.
మాజీ నక్సలైట్ సిద్దన్న దారుణ హత్య
by Telugu Lo Computer at November 28, 2025
Labels:
Criem
,
Former Naxalite Siddhanna brutal murder
,
suburbs of Vemulawada in Rajanna Sircilla district
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment