కోకాపేటలో ఎకరం రూ.137.25 కోట్లు


హైదరాబాద్ లోని  కోకాపేట, నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వలం నిర్వహించారు హెచ్ఎండీఏ అధికారులు. ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్ల పలికింది. ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి రూ.137.25 కోట్ల పలికింది. వేలంలో 9.90 ఎకరాలకుగాను హెచ్ఎండీఏకి రూ.1,355.33 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లో మిగిలిన భూములను ఈ నెల 28న హెచ్ఎండీఏ అధికారులు వేలం వేయనున్నారు.

Post a Comment

0 Comments