కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని అన్నారు.అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని తాను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ, తాజాగా అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యమని చెప్పడం చర్చనీయాంశమైంది.
0 Comments