ఢిల్లీలో జరిగిన ఒక వివాహ వేడుకలో భాగంగా జరిగిన హల్దీ వేడుకలో హైడ్రోజన్ బెలూన్లు పేలిపోయాయి. ఈ ఘటనలో వధూవరులు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ జంట హైడ్రోజన్ బెలూన్లను పట్టుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వేడుకలో భాగంగా కలర్ గన్స్ పేల్చుతున్నారు. అయితే, కలర్ గన్స్ లో ఒకటి అనుకోకుండా హైడ్రోజన్ బెలూన్లను తాకింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల చేతుల్లో ఉన్న బెలూన్స్ భారీ శబ్ధంతో పేలిపోయాయి. కొన్ని సెకన్లలోనే, అన్ని బెలూన్లు మంటల్లో చిక్కుకుని పేలిపోయాయి. నూతన వధూవరులు భయంతో అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. ఈ ఘటనలో వధూవరులు గాయపడ్డారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తాన్యాగా గుర్తించబడిన వధువు ముఖం, వీపుపై గాయాలు కాగా, వరుడు కుషాగ్ర వేళ్లు, వీపుపై గాయాలయ్యాయి. పేలుడులో ఇద్దరికీ జుట్టు కూడా స్వల్పంగా కాలింది. హైడ్రోజన్ బెలూన్ల వాడకం ప్రమాదకరం అని, ఆర్భాటాల కోసం కాకుండా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈవెంట్ ప్లానర్లు, కుటుంబాలను నెటిజన్లు సూచిస్తున్నారు.
హల్దీ వేడుకలో హైడ్రోజన్ బెలూన్ పేలి వధూవరులకు గాయాలు : వీడియో నెట్టింట వైరల్
by Telugu Lo Computer at November 24, 2025
Labels:
Hydrogen balloons explode during haldi ceremony
,
injuring bride and groom
,
national
,
New Delhi
,
one of the color guns accidentally hit the hydrogen balloons
,
Video goes viral on the internet
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment