జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు


జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షడు మౌలానా మహమూద్ మదానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మైనార్టీలపై అణచివేత జరిగితే భారత్‌లో జీహాద్ జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మైనార్టీ హక్కులను తక్కువ చేస్తోందని.. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటి తీర్పులు చూస్తే న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడి ఉందనిపిస్తోందని అన్నారు. రాజ్యాంగంలో మైనార్టీలకు పొందుపర్చిన హక్కులను బహిరంగంగా ఉల్లంఘించారన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా మైనార్టీ హక్కులను తక్కువచేసే తీర్పులు చాలా వచ్చాయన్నారు. మైనార్టీల హక్కులు, న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మదానీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రార్థన స్థలాల చట్టం ఉన్నప్పటికీ కేసుల విచారణ తీరును మదానీ తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని కాపాడుతున్నంతసేపు మాత్రమే సుప్రీంకోర్టు.. సుప్రీంగా (అత్యున్నతంగా) ఉంటుందని చెప్పారు. అలా జరగనప్పుడు అది సుప్రీం కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "సమాజంలో జీహాద్‌ను వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వం, మీడియా కలిసి ఈ పవిత్ర విధానాన్ని వక్రీకరిస్తున్నాయి. లవ్ జీహాద్, ల్యాండ్ జిహాద్, స్పిట్ జీహాద్.. వంటి పదాలను వాడటం తప్పు. జీహాద్ ఎప్పటికీ పవిత్రమైనదే. ఇతరుల మంచి కోసమే జీహాద్ జరుగుతుంది. అణిచివేయాలని చూస్తే జీహాద్ జరగక తప్పదు" అని మదానీ హెచ్చరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

No comments:

Post a Comment

3