ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి : రాహుల్‌గాంధీ డిమాండ్


ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఢిల్లీ వాసులు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఢిల్లీలో జీవించలేకపోతున్నామని వాపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనని కోరారు.''నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకటే చెప్పారు. బిడ్డలు విషపూరిత గాలిని పీల్చుకుంటున్నారని. నీరసించి పోవడమే కాకండా భయపడుతున్నారని చెప్పారు. ఆందోళనగా ఉంటున్నారని వాపోయారు. మోడీ జీ ! భారతదేశ పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరెలా మౌనంగా ఉండగల్గుతున్నారు? మీ ప్రభుత్వానికి ఎందుకు అత్యవసర ప్రణాళిక లేదు. జవాబుదారీతనం లేదా?'' అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ''ఆరోగ్య అత్యవసర పరిస్థితిని'' పరిష్కరించడానికి దేశానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. ''మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు- సాకులు, పరధ్యానాలు కాదు.'' అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment

3