తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్పలు దుర్మరణం


తమిళనాడులోని రామనాథపురం మెడికల్ కాలేజ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన ఇద్దరు అయ్యప్పలు మృతి చెందగా, మరో నలుగురు అయ్యప్పలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పలాస మండలం వీర రామచంద్రపురం గ్రామానికి చెందిన పైడిరాజు (25),పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాల నవీన్(26) గా గుర్తించారు. అయ్యప్ప మాలధారణలో పలాస మండలం నుంచి ఆరుగురు అయ్యప్ప భక్తులు కారులో కేరళలోని అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ మాల విరమణ చేసి మార్గమధ్యంలో కొన్ని ప్రముఖ ఆలయాలను దర్శించుకొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రామనాథపురం వద్ద టెంపో ట్రావెల్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. దీంతో తమిళనాడు రాష్ట్ర రెస్క్యూ బృందం కారులో ఇరుక్కున్నవారిని బయటకు తీసి అంబులెన్స్ లో హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

3