ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత వారం టాప్‌లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే చివరి రెండు వన్డేల్లో మిచెల్ ఆడకపోవడంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. కాగా నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీంట్లో రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. ఆ మ్యాచుల్లో రాణిస్తే రోహిత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. గాయం బారిన పడి ఆటకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎనిమిది నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. కేఎల్ రాహుల్ 16వ స్థానంలో ఉన్నాడు. టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన రోహిత్ శర్మ
by Telugu Lo Computer at November 26, 2025
Labels:
cricket
,
has slipped to second place
,
international
,
New Zealand's Daryl Mitchell
,
Rohit Sharma regains top spot in ICC ODI rankings
,
sports
,
who was at the top last week
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment