Ad Code

రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్ : సోషల్‌ మీడియాలో వైరల్‌


రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను థార్‌ వాహనంతో ఢీకొట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు ఆ ముగ్గురిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. బైక్‌ నుంచి కింద పడిన ఆ వ్యక్తులు పైకి లేచారు. తమ వద్ద ఉన్న గన్స్‌ తీసి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో థార్‌లోని వ్యక్తులు వెనక్కి తగ్గారు. ఇంతలో మారుతి స్విఫ్ట్‌ కారు ఆ ముగ్గురిపైకి దూసుకెళ్లగా వారు తప్పించుకున్నారు. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత థార్‌, స్విఫ్ట్‌ కారులోని వ్యక్తులు కిందకు దిగారు. రోడ్డు పక్కన పడి ఉన్న బైక్‌ను ఐరన్‌ రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం తమ వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్‌ వార్‌ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాల్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బైక్‌పై ఉన్న మహిపాల్ గుర్జార్, థార్‌లో ఉన్న వినోద్ పోస్వాల్ మధ్య పాత శత్రుత్వం ఉన్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన గ్యాంగ్‌ వార్‌కు కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు గ్యాంగ్‌లకు చెందిన వారి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్‌ వార్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu