చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో ట్రాక్ నిర్వహణ కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో కార్మికులు ట్రాక్ సాధారణ నిర్వహణ పనులు చేస్తుండగా టెస్ట్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ వెల్లడించింది.
0 Comments