హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించి మాట్లాడుతూ ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రో పాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
0 Comments