వారం వ్యవధిలో ఇద్దరు డీఆర్డీఓ యువ శాస్త్రవేత్తలు మృతి

Telugu Lo Computer
0


డీఆర్డీఓ యువ శాస్త్రవేత్తలు ఇద్దరు వారం వ్యవధిలో ఆకస్మిక మరణాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇద్దరూ యువకులు, ఆరోగ్యంగా ఉన్నారు..ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అకస్మాత్తుగా మృతి చెందడంపై డాక్టర్లకే అంతు చిక్కడం లేదు. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినా ఆ లక్షణాలు చాలా తక్కువే అంటున్నారు డాక్టర్లు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వస్తేగానీ ఏం తేల్చలేమని చెబుతున్నారు. డీఆర్డీఓ కీలక మిషన్లలో పనిచేస్తున్న ఈ ఇద్దరు సైంటిస్టుల మృతి ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగా మారింది. లక్నోకు చెందిన 30 ఏళ్ల ఆకాష్ దీప్ గుప్తా డీఆర్డీఓ లో బ్రహ్మోస్ క్షిపణి మిషన్‌పై పని చేస్తున్నారు. పెళ్లై ఆరునెలలు అయింది. ఢిల్లీలో ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చి నవంబర్ 21న ఉన్నట్టుండి ఇంట్లోనే అనారోగ్యం పాలయ్యాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇంకొకరు ఢిల్లీ అల్వార్ కు చెందిన ఆదిత్య వర్మ. నవంబర్ 27న అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. పెళ్లైన రెండు రోజులే అయింది.  కొత్త జంట హానీమూన్ ప్లాన్ చేసుకున్నారు. టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆదిత్య కుటుంబం తెలిపింది. మరో రెండు రోజుల్లో హానీమూన్ వెళ్లనున్న ఆదిత్యవర్మ ఆకస్మాత్తుగా విగతజీవిగా మారాడు. ఇద్దరి మరణాలు దాదాపు ఒకేరకంగా సంభవించాయి. కుటుంబ సభ్యులు గుండెపోటు తో మరణించి ఉండొచ్చు అని చెబుతున్నా డాక్టర్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే సరియైన కారణాలు చెప్పగలం అని చెబుతున్నారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default