జనవరి 26న రెనాల్ట్ కొత్త తరం డస్టర్ SUV విడుదల !


దేశీయ మార్కెట్లో రెనాల్ట్ కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు మరోసారి బలమవుతుందని అంచనా. కొత్త జనరేషన్ డస్టర్పూర్తిగా పాత మోడల్‌లోని మెకానికల్, డిజైన్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో కొనసాగించలేదు. ఇది సీఎంబీ-బీ ప్లాట్‌ఫామ్‌పై తయారు అవుతుంది. భారత్‌లోని ఒరగడం ప్లాంట్ లో దీనిని తయారు చేయనున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీలతో డస్టర్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.  ప్రస్తుతం కిగర్ మాత్రమే ఉన్న రెనాల్ట్ SUV లైనప్‌లో డస్టర్ తిరిగి రావడం కంపెనీకి పెద్ద బూస్ట్‌గా మారనుంది. రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న కొత్త డిజైన్ (స్పై షాట్స్) ప్రకారం.. కొత్త డస్టర్ మరింత రగ్డ్, స్టైలిష్ రూపాన్ని దాల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

No comments:

Post a Comment

3