పాకిస్థాన్ లోని ఆడియాలా జైలులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? అంటూ ఇమ్రాన్ అక్కాచెల్లెళ్లు జైలు వద్దకు వెళ్లారు. ఇమ్రాన్‌పై పోలీసులు క్రూరంగా దాడి చేశారని వారు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ అక్కాచెల్లెళ్ల పేర్లు నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లురా వల్పిండిలోని ఆడియాలా జైలు వద్దకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలవనివ్వాలని జైలు బయట పాక్ తహ్రీక్ ఏ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేతలతో కలిసి ఆ ముగ్గురు మహిళలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు తమపై దాడి చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి ఆడియాలా జైలులో ఉన్నారు. ఆయనను మూడు వారాలుగా కలవనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని నూరీన్ నియాజీ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అన్నారు. పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వార్‌కు వారు ముగ్గురు లేఖ రాశారు. ఈ హింస క్రూరమైందని, ముందస్తుగా ప్రణాళికలో భాగంగా దాడి చేశారని పేర్కొన్నారు. "ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై మాలో ఆందోళన నెలకొంది. దీంతో మేము శాంతియుతంగా నిరసన చేశాం. అయినా ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు ఆర్పేశారు. వెంటనే పంజాబ్ పోలీస్ సిబ్బంది క్రూరంగా దాడి చేశారు" అని నూరీన్ నియాజీ అన్నారు. "నా వయస్సు 71. నా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేసి రహదారి మీదకు లాగేశారు, గాయాలు అయ్యాయి" అని ఆమె ధ్వజమెత్తారు. జైలు బయట ఉన్న ఇతర మహిళలను చెంపదెబ్బలు కొట్టి లాగేశారని ఆమె చెప్పారు. పోలీసుల ప్రవర్తన పూర్తిగా నేరపూరితమైనది, అక్రమం, అనైతికం అని మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది. ఆయన మృతి చెందాడని చాలా కాలంగా వదంతులు వస్తూనే ఉన్నాయి. ఖాన్ సెల్‌లో ఒంటరిగా ఉన్నాడని ఆయన పార్టీ తెలిపింది. పాక్‌లో ఆటవిక పాలన నడుస్తోందని, పాలించే మృగానికే హక్కులు ఉంటాయని, ఇంకెవరికీ హక్కులు ఉండట్లేదని ఇమ్రాన్ న్యాయవాది ఖాలిద్ యూసఫ్ చౌధరి అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదికి కూడా అనుమతి ఇవ్వలేదు. అఫ్రిది వరుసగా ఏడు సార్లు ప్రయత్నించినా జైలు అధికారులు నిరాకరించారని, వారిని ఒక సైనిక అధికారి నియంత్రిస్తున్నాడని ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల క్రితం ఆరోపించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం : జైలు వద్ద ఉద్రిక్తత
by Telugu Lo Computer at November 26, 2025
Labels:
international
,
Social media claims that former Pakistani Prime Minister Imran Khan was murdered
,
Tension at the jail
,
These three sisters went to Adiala Jail in Walpindi
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment