బ్లాక్ ఫ్రైడే - డిస్కౌంట్ ఆఫర్లు !
బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం అమెరికాలోనే ప్రారంభమైంది. అక్కడ ఈ రోజును ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఓ రకంగా దీనిని థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే నవంబర్ 28వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచే క్రిస్మస్ షాపింగ్ మొదలవుతుందని వారు నమ్ముతారు. ఈ అవకాశాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. మొదట్లో బ్లాక్ ఫ్రైడేను అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలలో కూడా దీని క్రేజ్ పెరిగింది. ఇ-కామర్స్ వెబ్ సైట్లు ఈ క్రేజ్ ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే దీనిని ఇతర దేశాలలో కూడా జరుపుకోవడం ప్రారంభించారు. బ్లాక్ ఫ్రైడే అనే పేరు వినగానే ఇది చెడు లేదా దురదృష్టకరమైన రోజుగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను చూస్తే అలా అనిపించదు. కానీ ఈ పేరు పెట్టినప్పుడు నిజంగానే దీనిని బ్లాక్ డేగా భావించి పెట్టారట. వాస్తవానికి బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి గుర్తుగా చెప్తారు. దానికి సంబంధించిన షాపింగ్ చేస్తారు. పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో రద్ద...