Posts

Showing posts with the label He reminded that Team India was clean swept by New Zealand 3-0

కోహ్లీ, రోహిత్ జట్టులో ఉన్నా ఇదే ఫలితం పునరావృతమయ్యేది !

Image
ద క్షిణాఫ్రికాతో జరిగిన  టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం మేనేజ్‌మెంట్, సెలెక్టర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వారికి మద్దతు తెలిపాడు. ప్రస్తుతం జట్టు సంధి దశలో ఉందని తెలిపారు. దాంతోనే ఆశించిన ఫలితం దక్కలేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదనే వాదనను తప్పుబట్టారు. కోహ్లీ, రోహిత్ జట్టులో ఉన్నా ఇదే ఫలితం పునరావృతమయ్యేదని నొక్కి చొప్పాడు.సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా రెండు సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్‌లను ఇంకొన్నాళ్లు జట్టులో కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనను గవాస్కర్ తప్పుబట్టాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ అయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టీమిండియా ఓడిపోయిందని చెప్పారు. 'రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయ...