చైనా మార్కెట్లో షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో విడుదల
చైనా మార్కెట్లో షియోమీ కంపెనీ షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో మోడళ్లను కొత్త టాబ్లెట్లను విడుదల చేసింది. ఈ రెండు టాబ్లెట్లు 3.2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రాసెసింగ్ కోసం రెండు మోడళ్లలోనూ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను అందించారు. HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. షియోమీ ప్యాడ్ 9 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.42,800)గా నిర్ణయించారు. 8GB + 256GB మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.47,000), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB స్టోరేజ్‌తో వచ్చే Soft-Light Edition ధర CNY 3,499 (సుమారు రూ.49,900). ఈ టాబ్లెట్ సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్, ఐస్ పీచ్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9ప్రో 8GB + 128GB బేస్ వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB మోడల్ ధర CNY 4,099 (సుమారు రూ.58,500), 12GB + 256GB ధర CNY 4,599 (సుమారు రూ.65,600), 16GB + 256GB వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ.71,300)గా ఉంది. 12GB + 256GB Soft-Light Edition ధర CNY 4,799 (సుమారు రూ.68,400). ఇది సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 12.5 అంగుళాల 3.2K డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 12GB, 16GB వేరియంట్లలో 9,600Mbps వేగంతో LPDDR5T RAM, 8GB వేరియంట్‌లో 8,533Mbps LPDDR5X RAM ఉంటుంది. 128GB మోడల్‌లో UFS 3.1 స్టోరేజ్, మిగిలిన వేరియంట్లలో UFS 4.1 స్టోరేజ్ అందించారు. షియోమీ ప్యాడ్ 9 లో 11.2 అంగుళాల 3.2K డిస్‌ప్లే ఉంటుంది. 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను అందించారు. షియోమీ ప్యాడ్ 9 ప్రో లో భారీ 11,000mAh బ్యాటరీ ఉంది. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. షియోమీ ప్రకారం షార్ట్-వీడియో ప్లేబ్యాక్‌లో 14.5 గంటలు, ఆన్‌లైన్ మీటింగ్స్‌లో 20 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9లో 9,720mAh బ్యాటరీను అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోడల్ కూడా షార్ట్-వీడియో ప్లేబ్యాక్‌లో 14.5 గంటలు, ఆన్‌లైన్ మీటింగ్స్‌లో 20 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు టాబ్లెట్లలోనూ Xiaomi HyperOS 4 ఉంటుంది. PC-స్థాయి ప్రొడక్టివిటీ కోసం WPS for Pad, Jianying Pro, PixelCake, ZWCAD, CAJ Reader వంటి యాప్స్‌కు సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా కంపెనీకి చెందిన Super XiaoAI 2.0 AI అసిస్టెంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.
Comments
Post a Comment