వచ్చే ఏడాది ప్రథమార్ధంలో యాపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ ను లాంచ్ చేయనుంది. గతంలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలో టైటానియం ఫ్రేమ్ వాడినట్లుగానే ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్ ని వాడారు.దీనిలో కెమెరా బంప్ పెద్దదిగా ఉంటుంది. దీన్ని అల్యూమినియంతో తయారు చేయనున్నారు. ఇది మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా కనిపిస్తుంది. యాపిల్ కు సంబంధించిన కొత్త ఏ19 ప్రో చిప్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది టీఎస్ఎమ్సీ 3ఎన్ఎం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్, కెపాసిటీని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు యాపిల్ రూపొందించిన వైఫై 7 చిప్ ను వాడారు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ల్లో 12 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఐఫోన్ 16 ప్రోలో అందించిన 8 జీబీ ర్యామ్ కంటే ఎక్కువ. మల్టీ టాస్కింగ్, యాపిల్ ఏఐ ఆధారిత ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి ఈ అప్ గ్రేడ్ చేశారు. ఐఫోన్ 17 సిరీస్ లో ప్రధాన కెమెరా అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ముందు కెమెరాను 12 మెగాపిక్సెల్ నుంచి 24 మెగాపిక్సెల్ కి, ప్రో మోడల్స్ లోని టెలిఫోటో కెమెరాను 48 మెగాపిక్సెల్ కి అప్ గ్రేడ్ చేయవచ్చు. ఇది ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ప్రో మాక్స్ మోడల్ లో ఒక చిన్న డైనమిక్ ఐలాండ్ అందిస్తారని సమాచారం. ఇది స్క్రీన్ టు బాడీ రేషియోను మెరుగుపరుస్తుంది. ఫేస్ ఐడీ సిస్టమ్ మెటా లెన్స్ ని ఉపయోగించడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుంది.
త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 17 ప్రో సిరీస్ !
by Telugu Lo Computer at November 30, 2024
Labels:
apple
,
science
,
technology
,
టైటానియం ఫ్రేమ్
,
త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 17 ప్రో సిరీస్
,
మల్టీ టాస్కింగ్
,
యాపిల్ ఏఐ ఆధారిత ఫీచర్లకు సపోర్ట్
,
యాపిల్ కు సంబంధించిన కొత్త ఏ19 ప్రో చిప్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment