నవంబర్ 29న ఐక్యూ నియో 10 సిరీస్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫీచర్ లతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు .ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్.డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 1.5 కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందిస్తున్నారు. గేమింగ్ అనుభవం కోసం ఇందులో క్యూ2 చిప్ ను కూడా అందించారు. ఈ ఫోన్ లో 61000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో కస్టమైజ్డ్ OISని అందిస్తున్నారు. దీంతో ఫొటోలు బ్లర్ కాకుండా ఉంటాయి. రెక్టాంగులర్ కెమెరా సెటప్ ను కూడా ఇందులో ఇవ్వన్నారు. పంచ్ హోల్ తో కూడిన డిస్ప్లేను ఇవ్వనున్నారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌ను ర్యాలీ ఆరెంజ్, షాడో బ్లాక్, వైట్ కలర్స్ లో తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన కెమెరాను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
29న ఐక్యూ నియో 10 సిరీస్ ఫోన్ విడుదల ?
by Telugu Lo Computer at November 27, 2024
Labels:
1.5 కే రిజల్యూషన్
,
144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
,
29న ఐక్యూ నియో 10 సిరీస్ ఫోన్ విడుదల ?
,
IQUOO
,
science
,
smart phone
,
technology
,
స్నాప్.డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment