బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 200 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను ఈ ప్లాన్ ద్వారా పొందలేరు. కేవలం కాలింగ్ కోసమే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును వినియోగిస్తుంటే మాత్రం ఈ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. రెండో సిమ్ కార్డుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు 997 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 160 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. కాలింగ్‌తోపాటు డేటా, ఎస్ఎంఎస్ అవసరాలు కూడా ఉన్న యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజువారీ 2GB డేటాతోపాటు 100 ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు. ప్రైవేటు టెలికాం సంస్థలు సుమారు రూ.1,000 ధరలో అందుబాటులో ఉన్న ప్లాన్‌లలో కేవలం 90 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 1.5GB నుంచి 2GB డేటాను అందిస్తున్నాయి. దీంతోపాటు రోజువారీ 100 ఎస్ఎంఎస్ లను అందిస్తున్నాయి. దీంతోపాటు ఉచితంగా హలో ట్యూన్స్‌ను కూడా పొందవచ్చు. అదే బీఎస్ఎన్ఎల్ రూ.1198 రీఛార్జ్ ప్లాన్‌తో సంవత్సరం పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 300 నిమిషాలపాటు కాలింగ్ చేసుకోవచ్చు. మరియు నెలవారీ 3GB డేటా సహా 30 ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు. సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడం సహా కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లను పరిమితంగా ఉపయోగించుకొనేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
0 Comments