చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి !
సికింద్రాబాద్ లోని ఓ పాఠశాలలో చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్ధి మృతి చెందాడు. విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్ లోని ప్రయివేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. ఆ విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.