Ad Code

ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ !


న్‌స్టాగ్రామ్ వాట్సాప్ లాగా లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్ తమ వినియోగదారులకు లైవ్ లొకేషన్‌లను స్నేహితులతో, ఫ్యామిలితో పంచుకోవడానికి యాక్సెస్ ఇచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఇతర సోషల్ మీడియా ఛానెల్స్ లో ఉపయోగిస్తున్నారు. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌లలో పని చేస్తుంది. లైవ్ లొకేషన్‌ను గంట వరకు షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో లొకేషన్ షేరింగ్ 8 గంటల వరకూ ఉంది.  ఇన్‍స్టాగ్రామ్ లో ఇంకా ఎక్కువ సమయం లొకేషన్ షేరింగ్ కావాలంటే మరలా పంపించుకోవాలి. ఈ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu