చిరు ధాన్యాలు - ఆరోగ్య ప్రయోజనాలు !


రాగులు, జొన్నలు, కొర్రలు, అండు కొర్రలు, సజ్జలు, ఊదలు, అరికలు, సామలు, వరిగలు, వంటి వాటిని చిరు ధాన్యాలు (మిల్లెట్స్) అంటారు. వీటిల్లో ప్రోటీన్, డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు గోధుమలకు బదులు మిల్లెట్స్‌ను డైట్‌లో యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గోధుమ కంటే మిల్లెట్స్‌ సులభంగా జీర్ణమవుతాయి. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటంతో తక్కువ మొత్తంలో తిన్నాసరే కడుపు నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. మిల్లెట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను న్యూట్రలైజ్‌ చేస్తాయి. పైగా తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో ఈజీగా బరువు తగ్గుతారు. మిల్లెట్‌లోని పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్‌ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మిల్లెట్స్‌ ఎక్కువ సమయం ఎనర్జీని అందిస్తాయి. గోధుమల్లా మిల్లెట్స్‌లో గ్లూటెన్ ఉండదు. ఇది కొంతమందికి ఉబ్బరం, అలసట, బరువు పెరగడం, జీర్ణ సమస్యల వంటివి తీసుకొస్తుంది. మీకు గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఉదరకుహర వ్యాధి ఉంటే మిల్లెట్స్‌ మంచి ఆల్టర్నేటివ్ అవుతుంది. మిల్లెట్స్‌లోని ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిది. ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. బి విటమిన్లు మెదడు పనితీరును పెంచుతాయి. మిల్లెట్స్‌తో వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. అన్నంగా నేరుగా వండుకొని తినొచ్చు లేదా పొడి కొట్టి రొట్టెలు చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో అయితే వింటర్ మిల్లెట్ కట్లెట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చలికాలంలో ఎక్కువగా లభించే క్యారెట్, కాలీఫ్లవర్, ముల్లంగితో ఈ కట్లెట్ తయారు చేస్తారు. ముందు 1/2 కప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఉప్మా, చిలగడదుంప మిశ్రమం (1 ఉడికించిన చిలగడదుంప, 1 తరిగిన పచ్చిమిర్చి, ½ తరిగిన ఉల్లిపాయ) రెడీ చేసుకోవాలి. ఒక క్యారెట్‌ తురుము, ఒక ముల్లంగి తురుము, సగం కాలీఫ్లవర్‌ తురుము, ఉప్పు, ఎర్ర కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా అవసరం. ఒక ప్యాన్‌లో మీకు నచ్చిన మిల్లెట్స్ వేసి వేయించాలి. తర్వాత సరిపడా నీరు పోసి ఉడికించాలి. మిల్లెట్ ఉప్మాలో నీరు ఇంకిపోయిన తర్వాత, దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత క్యారెట్, ముల్లంగి, కాలీఫ్లవర్ తురుములో తగినంత ఉప్పు వేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. వాటిలో నుంచి నీరు వేరవుతుంది. తురిమిన మిశ్రమం నుంచి మొత్తం నీటిని పిండేయండి. చిలగడదుంప మిశ్రమాన్ని మిల్లెట్ ఉప్మాలో కలపండి. అన్ని మసాలా దినుసులు వేసి వాటిని చేతులతో బాగా కలపండి. వాటిని షేప్ వచ్చేలా చేసుకుని.. పాన్ మీద ఒక చెంచా నెయ్యి వేసి కాల్చండి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. మీకు నచ్చిన సాస్, చట్నీతో ఎంజాయ్‌ చేయవచ్చు.

Post a Comment

0 Comments