Ad Code

అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 2024 ప్రారంభం !

మెజాన్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 2024 ను ఈరోజు  ప్రారంభించింది. ఇది  డిసెంబర్‌ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా గ్యాడ్జెట్‌లు, గృహోపకరణాలు సహా ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరకు లభిస్తాయి. ఈ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 40-75 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చని అమెజాన్‌ చెబుతోంది. దీంతోపాటు ఇతర గృహోపకరణాలపై 65 శాతం డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ అమెజాన్‌ బ్లాక్‌ ఫ్లైడే సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌లు క్యాష్‌బ్యాక్‌లతోపాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ అమెజాన్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ లో భాగంగా హెచ్ఎస్బీఎస్ , హెచ్డీఎఫ్సీ, ఇండస్‌ ఇండ్‌, బ్యాంక్ ఆఫ్‌ బరోడా బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ కార్డులపై ఈఎంఐ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు అమెజాన్‌ బ్రాండ్‌ సంబంధిత క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్‌ ఉత్పత్తులు సహా శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ 2 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా, సోనీ ప్లే స్టేషన్‌, షియోమీ స్మార్ట్‌టీవీ, అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ స్మార్ట్‌వాచ్‌ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు మరిన్ని బ్రాండ్‌ల ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu