తెలంగాణలోని ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల కిందటే అమెరికాకు వెళ్లాడు. అక్కడ చదువుతూ ఓ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోచికాగోలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన తర్వాత సాయితేజ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్న ఈ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంపై వాళ్లు వాపోతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అక్కడి తెలుగు సంఘాలను కోరుతున్నారు.
0 Comments