తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభం !


తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మెరుగైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్, వెంకటేశ్, జ్యోత్స్నలు పర్యటన చేపట్టారు. నేటి నుంచి డిసెంబరు 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారు. ఇవాళ సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లలో కమిషన్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ పర్యటనకు సహకరించడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Post a Comment

0 Comments