సపోటలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పండ్లను నేరుగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా లేక సలాడ్లు, డెజర్ట్స్‌లో యాడ్ చేసుకున్నా మంచిదే. సపోటలో ఫైబర్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కీలకమైన విటమిన్ ఏ,బీ,సీ ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంతో వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఆకలి తగ్గి ఇతర ఆహారం తినాలని అనిపించదు. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం సమస్యకు కూడా చెక్ పెట్టి టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ని తగ్గిస్తుంది. సపోటలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగు పరచడంతో పాటు బోన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అయితే, సపోటను మితంగా తినాలి. అతిగా తింటే ఫైబర్ కంటెంట్ కారణంగా స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కడుపు ఉబ్బరం, నీళ్ల విరేచనాలు వంటివి ఎదురుకావచ్చు. అతిగా తింటే త్వరగా జీర్ణం కాక కొందరిలో కడుపు నొప్పి రావచ్చు. సపోటలో టానిన్లు, లాటెక్స్ వంటి కెమికల్స్ ఉంటాయి. అందుకే వీటిని తిన్నవారిలో కొందరికి అలర్జీ రియాక్షన్స్ వస్తాయి. చర్మం ఎర్రబడటం, గొంతువాపు, స్కిన్ రాషెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సపోటలో నేచురల్ షుగర్స్, క్యాలరీల కారణంగా డయాబెటిస్ ముప్పు మరింత పెరుగుతుంది. వీటిని ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోయి షుగర్ పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సపోట పండు తినకపోవడం మంచిది. దీంట్లో ఉండే రెసిన్ అనే పదార్థంతో స్టమక్ యాసిడ్స్ మిక్స్ అయితే కడుపులో మంట, అసౌకర్యం కలుగుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ పండ్లు తినకూడదు. వీటిలో ఉండే టానిన్లు, ల్యాటెక్స్ వంటి సమ్మేళనాలు గొంతువాపు, స్కిన్ రాషెస్ వంటి అలర్జిక్ రియాక్షన్లు కనిపిస్తాయి. పిల్లలు కూడా వీటిని పరిమితంగా తినాలి. ఇప్పటికే డైజేషన్ సమస్యతో బాధపడే వారికి ఈ పండ్లు మరీ డేంజర్. అందుకే సపోట పండ్లను లిమిటెడ్‌గా తినాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు.
0 Comments