ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసు వదిలి ఇళ్లకు వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా ఇచ్చారు. ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని వారికి తెలిపారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తుచేశారు. ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ ఆఫీసుల్లో ఉండొద్దనేది తన విధానంగా వివరింంచారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అయినా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదన్నారు. అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు సూచించారు. గతంలో ఉద్యోగుల వ్యతిరేకిగా పేరు తెచ్చుకుని అధికారం కోల్పోయిన చంద్రబాబు ఈసారి మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
0 Comments